10. దేడ్ కహానీ - దిల్ చాహ్తా హై ... వి.ఎన్.ఆదిత్య Telugu Stories
స్నేహం... ప్రేమ కలిస్తే!
దేడ్ కహానీ - దిల్ చాహ్తా హై
‘‘మనసు కోతి లాంటిది.
యుక్త వయసులో ఏది పడితే అది కోరుకుంటుంది. బుద్ధి... బుద్ధిగా ఉండమని ఎంత చెప్పినా మనసు వినదు. ఎప్పుడో విధి ఒక హెడ్మాస్టారిలా ఏదన్నా ఒక సంఘటన రూపంలో లాగి మనసుని కొట్టినప్పుడు బుద్ధిగా మాట వింటుంది.
ఆ అనుభవాన్ని పాఠంలా అవలోకనం చేసుకుంటుంది. ఆ తర్వాత కూడా నిలబడేవే నిజమైన బంధాలు. అవే ఆ జన్మకి అందాలు.’’
ఈ వ్యాసం రాయడం కోసం ‘దిల్ చాహ్తా హై’ సినిమా మళ్లీ చూసినప్పుడు నాకిలా అర్థమైంది. కొన్ని సినిమాలు మొదటిసారి చూస్తే బావుండీ, బాలేక అటు ఇటుగా అనిపిస్తుంటాయి. తర్వాత వాటి రన్లో వాటి విలువ రోజురోజుకీ పెరిగి చివరికి అవి కల్ట్ ఫిల్మ్గానో, ఎపిక్ ఫిల్మ్గానో నిలుస్తాయి. దిల్ చాహ్తా హై... ఆ కోవకు చెందిన సినిమా.
‘షోలే’ రాసిన గొప్ప రచయితలు సలీమ్, జావేద్‌లలో జావేద్ అఖ్తర్ కొడుకు ఫర్హాన్ అఖ్తర్. చిన్నప్పట్నుంచీ సినిమా కుటుంబం, ఎగువ మధ్య తరగతి, ఆపైన సంపన్న జీవితాల సావాసం. ఆ యువత జీవనశైలితో ఓ కథ రాసుకున్నాడు. అది కూడా నెలన్నరపాటు అమెరికాలో హాలిడేకి వెళ్లినప్పుడు తన స్నేహితుల్ని కలిసి, వారితో సాగిన ముచ్చట్ల నుంచి, వారి ప్రేమకథల గురించి ఒక కథ రాసుకున్నాడు. అందుకే దిల్ చాహ్తా హై సినిమాలో నిజ జీవిత దర్పణం ఉంది. జీవం ఉంది. ప్రాథమిక హిందీ సినిమా కమర్షియల్ సూత్రాలన్నింటినీ బ్రేక్ చేసినా, కమర్షియల్‌గా హిట్ అవ్వగలిగిన ఆత్మ ఉంది.
ఆకాష్, సమీర్, సిద్ధూల పాత్రల్లో ప్రతి మిలీనియం యువకుడూ తనని తాను చూసుకున్నాడు. పక్కింటి ఆంటీకి సైటు కొట్టడం నుంచి, నచ్చిన ప్రతి అమ్మాయినీ ప్రేమించేయడం నుంచి, అమ్మాయి కోసం ఫ్రెండ్స్‌తో కూడా దెబ్బలాడి దూరం అవ్వడం నుంచి, ప్రేమ, విరహం, బాధ, నవ్వులు, మళ్లీ కలుసుకోవడం, అనుభూతులు - అన్నింట్లోనూ ఐడెంటిఫై అవ్వక తప్పని బలమైన సహజ పాత్రలు సృష్టించాడు దర్శక రచయిత ఫర్హాన్ అఖ్తర్.
అలాగే శాలిని, దీప, ప్రియ, పూజ, తార ఆంటీ - ఆధునిక భారతావని వనితల్లో ప్రతి ఒక్కరూ వీళ్లల్లో కనపడతారు. కన్ఫ్యూజన్లు, కోపాలు, ప్రేమలు, విరహాలు... అన్నీ.
పోస్టర్ చూశాక: ఒక మోడర్న్ కామెడీ సినిమా విత్ మల్టిపుల్ క్యారెక్టర్స్ అనిపించింది. ఆమిర్‌ఖాన్, ప్రీతిజింతా కోసం, ‘దిల్ చాహ్తా హై’ అని మంచి టైటిల్ పెట్టాడు కాబట్టి ‘దిల్‌తో పాగల్ హై’లో సగం ఉన్నా చాలనుకుని వెళ్లాలనుకున్నాను. దర్శకుడి మొదటి సినిమా అనగానే కాస్త భయం ఉంటుంది మనసులో నాకెప్పుడూ - అదృష్టవశాత్తూ ఫర్హాన్ అఖ్తర్ రెండో సినిమా ‘లక్ష్య’కి భయపెట్టాడు కానీ, మొదటి సినిమా ‘దిల్ చాహ్తా హై’ని అద్భుతంగా కన్నా కొంచెం ఎక్కువ బాగా తీశాడు.
నిజ జీవిత పాత్రల స్వభావాలు, కొన్ని సంఘటనలు స్నేహితుల నుంచి సేకరించినా, మరికొంత డ్రామాని, కథని షేక్స్పియర్ రాసిన ‘మచ్ ఎడో అబౌట్ నథింగ్’ నుంచి ప్రేరణ పొందినట్టు ఉంటుంది. మొదట ఆమిర్‌ఖాన్‌కి సిద్ధూ పాత్రని ఆఫర్ చేస్తే, ఆయన కథంతా విని ఆకాష్ పాత్ర నాకు బాగా దగ్గరగా ఉంది, ఆ పాత్రనే చేస్తానని ఎంచుకున్నార్ట. చాలాకాలం తర్వాత డింపుల్ కపాడియాని ఒప్పించి తార పాత్రకి తెచ్చుకోవడం ఫర్హాన్ కృషే.
అలాగే అభిషేక్ బచ్చన్ మొదట సిద్ధూ పాత్రని ఒప్పుకుని, చివరి నిమిషంలో డ్రాప్ అయితే, ఆ అవకాశం అక్షయ్ఖన్నా దక్కించుకున్నాడు. అలా, ఆమిర్‌ఖాన్, సైఫ్ అలీఖాన్, అక్షయ్ఖన్నా స్నేహితుల పాత్రలకి సెట్ అయ్యారు.
కథ గురించి చెప్పుకుంటే...
ఆకాష్ ధనవంతుల బిడ్డ - ప్రేమ, దోమ లాంటి ఫీలింగ్స్‌ని నమ్మడు. ఫ్లర్ట్ చేసి వదిలేస్తుంటాడు ఏ అమ్మాయినైనా. సమీర్, సిద్ధూ ఎగువ, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు. సమీర్ ఏ అమ్మాయినైనా ఇట్టే ప్రేమించేసి, అదే నిజమని నమ్మేస్తుంటాడు. సిద్ధూ చాలా ముభావి. స్వతహాగా పెయింటర్. వీళ్ల స్నేహంలో వచ్చిపోయే సబ్ క్యారెక్టర్లే హీరోయిన్లు, తల్లిదండ్రులు అందరూ. ఈ స్నేహం విడిపోయినట్టు మొదటి సీన్లో చెప్పి, అక్కణ్నుంచి వీళ్ల ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది.
విశ్రాంతి సమయానికి సిద్ధూ, ఆకాష్ ఒకరినొకరు తిట్టుకుని విడిపోతారు. సెకెండ్ హాఫ్‌లో వాళ్ల జీవితాల్లో వచ్చిన మార్పులు, ఒంటరిగా వాళ్లు తీసుకున్న నిర్ణయాలు, వాటి మంచీ చెడులు - చివరికి ముగ్గురూ కలవడం. ఇది కథ కాదు - కొందరి జీవితం. పాత్రల స్వభావాలకు అనుగుణంగా రాసుకున్న సంఘటనలు, వాటివల్ల ఉత్పన్నమయ్యే ఎమోషన్లు - కాబట్టి ఈ సినిమాలో పాత్రలు ఏడిస్తే మనకు ఏడుపొస్తుంది. పాత్రలు నవ్వితే మనకి నవ్వొస్తుంది. పాత్రలు దెబ్బలాడుకుంటే మనకి బాధేస్తుంది. పాత్రలు మళ్లీ కలుసుకుంటే మనకు కళ్లు చెమ్మగిల్లుతాయి.
ఈ పాత్రలకి తోడు వాళ్ల స్టైలింగ్, వాళ్లు నివసించే ఇళ్లు, గదులు, ఫర్నిచర్, కాస్ట్యూమ్స్ అన్నీ అంతే న్యాచురల్‌గా, అంతే అందంగా ఉండటం చెప్పుకోదగ్గ విషయం. శంకర్, ఎహ్సాన్, లాయ్ సంగీతం ఈ చిత్రానికి ఆయువుపట్టు. పాటలెక్కడా అసందర్భంగా ఉండవు. సీన్ల మధ్యలో ఒక్కో సీన్‌లాగే పాట వచ్చి వెళ్తుంది - సాహిత్యం కూడా క్యారెక్టర్లు మాట్లాడుకున్నట్టే ఉంటాయి.
డ్యాన్సర్లు, స్టెప్పులు లేకుండా సినిమాలో అన్ని పాటలూ తీయడం ఈ సినిమాకి క్లాస్‌ని ఆపాదించింది. ‘దిల్ చాహ్తా హై’ టైటిల్ ట్రాక్, జానెక్యూం లోగ్ ప్యార్ కర్తే హై, తన్హాయీ... అన్ని పాటలూ దేనికవే సూపర్హిట్లు. అన్నీ కథను ముందుకు నడిపించేవే. రవి.కె.చంద్రన్ ఛాయాగ్రహణం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, చెన్నైలో సౌండ్ ఇంజినీరు మీడియా ఆర్టిస్ట్ శ్రీధర్... వీళ్లంతా భారతీయ మిలీనియం సినిమా మీద దక్షిణాది నుంచి బలమైన ముద్ర వేసిన సాంకేతిక నిపుణులు.
జావేద్ అఖ్తర్ అన్ని పాటలూ యువతీ యువకుల మనోభావాల, భావాల సంఘర్షణలని, ఆనందాల్ని అక్షరీకరించాయి. పెట్టిన ప్రతి రూపాయికీ మరో రూపాయి లాభాన్ని తెచ్చి పెట్టిన చిత్రం ‘దిల్ చాహ్తా హై’.
ఈ సినిమాలో మాటల్లాగ, ఇది ఆకాష్ మ్యాజిక్. ఇది ఫర్హాన్ అఖ్తర్ మ్యాజిక్
- వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు
9. స్నేహం... ప్రేమ కలిస్తే! Telugu Comedy Story By వి.ఎన్.ఆదిత్య

Subscribe to:
Posts (Atom)